పీలేరు: ప్రమాద రహిత ఆర్టీసీ సంస్థగా మార్చాలి

61చూసినవారు
పీలేరు: ప్రమాద రహిత ఆర్టీసీ సంస్థగా మార్చాలి
పీలేరు ఆర్‌టిసి ఆదర్శ ఉద్యోగులకు శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. స్థానిక ఆర్‌టిసి గ్యారేజీలో జరిగిన కార్యక్రమంలో డిపో మేనేజర్‌ నిర్మల 2025 మార్చి నెలలో అత్యధిక కెయంపియల్‌ సాధించి తమ ప్రతిభచాటుకున్నన్న డ్రైవర్లు ఎంఆర్‌ మూర్తికి రూ.500లు, మరో డ్రైవర్‌ వి. సిద్దయ్యకు రూ.300లు బహుమతిగా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ ప్రమాద రహిత, ఇంధన పొదుపు, ఆదాయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్