కలికిరి వేలంలో రూ. 21.93 లక్షల ఆదాయం

56చూసినవారు
కలికిరి వేలంలో రూ. 21.93 లక్షల ఆదాయం
కలికిరి మేజర్ పంచాయతీలోని ఆదాయ వనరులకు మదనపల్లె డీఎల్పీఓ నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం వేలంపాట జరిగాయి. వారపు సంతను అశోక్ రెడ్డి రూ. 16 లక్షలకు, దినసరి కూరగాయల మార్కెట్ ను అల్లావుద్దీన్ రూ. 3 లక్షలకు, బస్టాండ్ గేటును ఇస్మాయిల్ రూ. 2.3లక్షలకు, జంతువధశాలను యల్. రాజ రూ. 90 వేలకు కైవసం చేసుకున్నారు. రెడ్డివారి యోగేశ్ రెడ్డి, ఈఓపీఆర్డీ రియాజుద్దీన్, ఈఓ జి. అశోక్, సర్పంచ్ యల్లయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్