ఉచిత ఇసుక విధానం హామీ ప్రకటన హర్షణీయం

83చూసినవారు
ఉచిత ఇసుక విధానం హామీ ప్రకటన హర్షణీయం
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత ఇసుక విధానం హామీ నెరవేర్చడం హర్షణీయమని బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బలరాం అన్నారు. నూతన ఇసుక పాలసీ అమలు చేసి, నిర్మాణ రంగానికి లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రికి మంగళవారం పీలేరులో కార్మికులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్ అలీ బేగ్, రసూల్, ఎన్టీఆర్ నఫీస్, రమణయ్య, మహబూబ్ బాష, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్