అరగొండ హుండీ లెక్కింపు.. రూ. 9. 48 లక్షల ఆదాయం

52చూసినవారు
తవణంపల్లి మండలం అరగొండ శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. 75 రోజులకుగాను రూ. 9, 48, 149 ఆదాయం వచ్చిందని ఈవో హనుమంతరావు తెలిపారు. బంగారం, వెండి రాలేదని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్