బంగారుపాలెంలో స్కూటర్ దొంగలించిన కేసులో నిందితుడికి చిత్తూరు సెషన్స్ కోర్టు జడ్జి ఉమాదేవి బుధవారం ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. తగ్గువారిపల్లె హరినాధరెడ్డి బైకును తుమ్మల ఈశ్వర్ ఈ ఏడాది జూన్ 12న చోరీ చేశాడు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడుపై నేరం రుజువు కావడంతో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.