కాణిపాకం స్వామివారి సేవలో చిత్తూరు ఎంపీ

57చూసినవారు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్