ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ: ఎంపిడిఓ

73చూసినవారు
ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ: ఎంపిడిఓ
పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం పండుగలా నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ ప్రసన్న కుమారి ఆదివారం తెలిపారు. ఎమ్మెల్యే మురళీ మోహన్ పూతలపట్టులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మండల వ్యాప్తంగా 8405 మంది పింఛను దారులు ఉన్నారన్నారు. పెంచిన పింఛనుతో పాటు మార్చి, ఏప్రిల్, జూన్ నెలలకు రూ. వెయ్యి చొప్పున కలిపి రూ. 7వేలు సోమవారం సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్