ఉపాధి హామీ పనుల పరిశీలన

66చూసినవారు
ఉపాధి హామీ పనుల పరిశీలన
కోరిన ప్రతి కూలీకి ఉపాధి హామీ పనులు కల్పించాలని డ్వామా పీడీ రాజశేఖర్ అధికారులను శనివారం ఆదేశించారు. ఐరాల మండలం ముదిగుల్లం పంచాయతీలో సప్లై ఛానల్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడారు. వీలైనంత ఎక్కువ మందికి పనులు కల్పించాలని ఏపీఓ సంధ్యారాణికి సూచించారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్