మామిడి రైతులకు సూచనలు

68చూసినవారు
మామిడి రైతులకు సూచనలు
ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక శనివారం సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్