పూతలపట్టు మండలం కుప్పన్నపల్లెలో మౌలిక వసతులు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి రోడ్లపైనే రాకపోకలు సాగిస్తున్నారు. నివాసాల ఎదుట చిన్నపాటి గుంతల్లో మురుగు నిల్వ ఉంటోందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు ఆదివారం కోరారు.