చిత్తూరు జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో సంకటహర గణపతి వ్రతం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ గణపతి వ్రతం వేడుకలు జరిగాయి. అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. కాగా నేడు సాయంత్రం స్వర్ణ రథోత్సవం జరగనుంది.