చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం ప్రమాదం తప్పింది. డ్రైవర్ వివరాల మేరకు, బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. సుమారు అరగంటకు పైగా రోడ్డుపై వాహనం నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.