పూతలపట్టు: అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు: ఈఓ

84చూసినవారు
పూతలపట్టు: అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు: ఈఓ
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తుల వద్ద నుంచి దుకాణదారులు అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో పెంచల కిశోర్ మంగళవారం హెచ్చరించారు. ఆలయ దుకాణాల సముదాయాన్ని, పాలాభిషేకానికి పాలు విక్రయించే స్థలాన్ని, లగేజీ, పాదరక్షలు, సెల్ ఫోన్ భద్రపరిచే కౌంటర్లను, కొబ్బరి కాయలు కొట్టే స్థలాన్ని సిబ్బందితో కలసి పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్