పూతలపట్టు మండల పరిధిలోని ముత్తిరేవుల సమీపంలోని జలాశయంలో శనివారం మృతదేహం కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు, మండల పరిధిలోని ఎన్టీఆర్ జలాశయంలో భాగమైన ముత్తిరేవుల సమీపంలో నిర్మించిన బ్రిడ్జి కింద మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.