పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలో బుధవారం లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు వారు పేర్కొన్నారు. లారీ యూటర్న్ తీసుకోవడం కోసం స్లో చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయింది. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.