కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చిత్ర పౌర్ణమి వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు. వరసిద్ధి వినాయక స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు మంగళ హారతులు చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ పెంచల కిశోర్, ఏఈఓ రవీంద్రబాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.