తవణంపల్లి మండలం ఏ. గొల్లపల్లిలో బుధవారం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీ మోహన్ వచ్చారు. గ్రామంలో దాదాపు 25 ఏళ్లుగా పలువురు పక్కా ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఇవాళ 47 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు.