పూతలపట్టు: వినాయకుడికి వెండి సామగ్రి వితరణ

72చూసినవారు
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వెండి దీపం, నైవేద్యం పాత్రలను దాతలు శనివారం విరాళంగా అందించారు. తిరుపతికి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు సుమారు 3.500 గ్రాముల వెండి వస్తువులను శనివారం ఆలయ ఈవో పెంచల కిషోర్కి అందించారు. దాతలకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్