తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధరను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా తవణంపల్లి మండలంలోని మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద పరిస్థితిని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ బుధవారం పరిశీలించారు. పక్వానికి వచ్చిన కాయాలను దశల వారీగా మాత్రమే కోసి గుజ్జు పరిశ్రమలకు తరలించాలన్నారు. తోతాపురి మామిడికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పూర్తిస్థాయి అమలు చేయాలని ఆదేశించారు.