చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని ఎగువపాలకురులో గంగమ్మ జాతరను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.