చిత్తూరు జిల్లాలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పరిధిలో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. రోజంతా ఎండ వేడిమికి తాళలేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. వర్షం కారణంగా వాహనాలను పార్కింగ్ చేయడానికి పలువురు భక్తులు ఇబ్బందులు పడ్డారు.