కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం కాకినాడ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కుటుంబ సమేతంగా గురువారం విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా దర్శన ఏర్పాట్లు చేయగా, వేద పండితులు ఆశీర్వచనం చేశారు. వీరితోపాటు జనసేన సీనియర్ నాయకులు పూల ప్రభాకర్, ఎం మహేష్ స్వేరో, యోగానంద, చరణ్పాతపాల్యం మాజీ సర్పంచ్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.