మామిడి రైతుల సమస్యలపై ఈనెల 9న బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డ్ లో జరిగే వైఎస్ జగన్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పిలుపునిచ్చారు. కర్ణాటకలో మామిడికి రూ. 16 రేటు లభిస్తే, ఏపీలో కేవలం రూ. 2 మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కార్య కర్తలు రైతులు సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.