కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఏఈఓ రవీంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఆలయ ఉభయదారుల అధ్యక్షుడు ఈశ్వర్ బాబు, ఎస్సై రామ్మోహన్ఉన్నారు.