చిత్తూరు జిల్లా కాణిపాకంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని పెద్ద కత్తితో కేక్ కట్ చేశారు. సినీ, రాజకీయ రంగాలలో బాలకృష్ణ విశేషంగా రాణిస్తున్నారని ఆయన చెప్పారు. కాణిపాకం ఆర్చ్ వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేశారు.