చిత్తూరు జిల్లా కాణిపాకం దళితవాడలో జరిగిన సత్యమ్మ జాతర మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరయ్యారు. ప్రతీ సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.