కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మధుసూదన్ రావు, ఏపీ రాష్ట్ర సీబీఐ డీఐజీ మురళీ రంభ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.