చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం వర్షం కురిసింది. కొన్ని రోజులుగా పూతలపట్టు మండలంలో వర్షాలు లేక తీవ్ర ఎండలకు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా ఒక్కసారిగా గురువారం సాయంత్రం వర్షం పడటంతో స్థానిక ప్రజలు ఉపశమనం పొందారు. వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.