చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో గురువారం వాతావరణం మారింది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. కాగా ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. గాలి లేకుండా కేవలం వర్షం కురవడంతో మండలంలోని మామిడి రైతులకు నష్టం తప్పింది. వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.