స్కూటర్ చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం కోర్టు తీర్పుచెప్పింది. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు 2024లో బంగారుపాలెం మండలం మొగిలిమిట్టూరుకు చెందిన జ్ఞానశేఖర్ బైక్ ను అదే మండలం, పొదలమడుగుకి చెందిన జార్జ్ లీ(29) దొంగిలించాడు. విచారించిన చిత్తూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఉమాదేవి ముద్దాయిపై నేరం రుజువుకావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.