తవణంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మాధవరం వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ లో అరగొండలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.