చిత్తూరు జిల్లాలోని పూతలపట్టుకు చెందిన రాధిక ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తన కాలు భాగం కాలిపోయింది. నడవలేని దీనస్థితిలో నిరుపేద జీవితంలో జీవనాన్ని కొనసాగిస్తోంది. తనకున్న ముగ్గురు పిల్లలను పోషించలేక ఇబ్బందులకు గురవుతున్నానని పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తనను, తన పిల్లలను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది.