పలమనేరు మున్సిపల్ కౌన్సిలర్ రాజేష్ చిన్నాన్న రాజేంద్ర నాయుడు రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. సమాచారం అందుకున్న జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు బంగారుపాల్యం మండలంలోని తిమోజిపల్లికి చెరుకుని రాజేంద్ర నాయుడు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.