చిత్తూరు జిల్లా , పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చీకల చేను పంచాయతీ గాండ్లవారిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం నాటు సారా తయారు చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఎస్సై షేక్షావలి తమ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల నాటుసారాతో పాటు సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.