వైద్యం వికటించి పది నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి పుంగునూరు పట్టణంలో జరిగింది. మండల పరిధిలోని నక్కబండలో ఉండే వెన్నెల, సుబ్రమణ్యం దంపతుల కుమారుడు సాత్విక్ అనారోగ్యానికి గురి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు ఇచ్చిన సిరఫ్ తాగించిన వెంటనే బాలుడు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బాలుడి మృతితో కుటుంబీకులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.