అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం పుంగనూరు పట్టణంలోని సిడిపిఓ రాజేశ్వరికి అఖిల భారత కోర్కెల దినోత్సవం సందర్భంగా వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్ పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వినతి పత్రంలో తెలిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో పుణ్యవతి, లీలావతి, వీణకుమారి, చంద్రావతి , కల్పన, అంజలి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.