చౌడేపల్లి మండలం బోయకొండ వైన్ షాప్ పక్కన టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిపై మంగళవారం మద్యం మత్తులో వ్యక్తి వీరంగం సృష్టించాడు. హోటల్ నిర్వాహకుడు బాబాజాన్ కాళ్లపై 36 చోట్ల కరిచి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.