చౌడేపల్లి మండలం స్థానిక చారాల గ్రామంలో సోమవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అడివి రమణ, మేస్త్రి రమణ, హరి ప్రసాద్, మురళి, సూర్యకాంత్ హరి, మల్లికార్జున, రెడ్డి ప్రకాష్, జగదీష్, ఇతర గ్రామ ప్రజలందరూ పాల్గొని జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని నినదించారు.