పుంగనూరులో బీజేపీ మండల కార్యశాల కార్యక్రమం శనివారం పట్టణ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు నిర్వహించారు. 11 ఏళ్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై వివరంగా తెలిపారు. ప్రధాని మోదీ సమర్థవంతమైన పాలనలో భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. పార్టీ ప్రతిష్ఠకు నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.