చౌడేపల్లె–పుంగనూరు రోడ్డులోని పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటాలు లోడ్ చేసిన వాహనం స్పీడ్ బ్రేకర్ల వద్ద వేగం తగ్గించలేకపోయింది. దీంతో వాహనంలోని టమాటా బాక్సులు కిందపడిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా రేటు ఎక్కువగా ఉండటంతో అక్కడికక్కడే పలువురు స్థానికులు వాటిని తీసుకునేందుకు ప్రయత్నించారు.