చౌడేపల్లె మండలం తామరాకులకుంట యానాది కాలనీలోని ఎనిమిది మంది గిరిజన చిన్నారులను చదివించేందుకు ఉపాధ్యాయురాలు అమృత కృషి చేస్తున్నారు. కానీ ఆధార్ లేకపోవడంతో పాఠశాల ఆన్‌లైన్ నమోదు సమస్యగా మారింది. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే 1, 2 తరగతుల్లో ఉన్నారు. మేకలచిన్నేపల్లె, గోసులకురప్పల్లె బడుల్లో ముగ్గురికీ ఇదే పరిస్థితి. అధికారులు త్వరలో ఆధార్ సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు.