చౌడేపల్లి బంగారుపాలెంలో ఈ నెల 9న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నడింపల్లి దామోదర్ రాజు ఆదివారం పిలుపునిచ్చారు. చౌడేపల్లి మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. మామిడి రైతులను పరామర్శించే సభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.