ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

75చూసినవారు
ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని సౌకర్యాలపై ఆరా తీశారు. 50 రోజుల్లో ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని సూపరింటెండెంట్ కు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్