పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ శక్తి పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి మంగళవారం కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు. ఆలయ సిబ్బంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా అన్ని ఏర్పాట్లను చేసామని తెలిపారు. ఆలయ సిబ్బంది భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.