చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఆర్టీసి డిపోలో ఈనెల 12న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలు 91009 41850 నంబర్ కు ఫోన్ చేసి చెప్పాలన్నారు.