మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

61చూసినవారు
పుంగనూరు పట్టణంలో జాతీయ మత్య దినోత్సవాన్ని వెంకటేశ్వర సహకార సంఘ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు జరిగిన అన్యాయాలను తెలియజేస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు. పట్టణంలోని మత్స్యకారుల సమస్యలను తీర్చాలని ఆ సంఘ నాయకుడు కృష్ణమూర్తి ఎన్డి ఏ కూటమి నాయకులను కోరారు. మత్స్యకారుల జీవనానికి కావాల్సిన బ్యాంకు రుణాలను కల్పించి పనిముట్లను ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్