పాఠశాలను తనిఖీ చేసిన వైద్యాధికారి

54చూసినవారు
పాఠశాలను తనిఖీ చేసిన వైద్యాధికారి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం పరిధిలోని చేరుకువారి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలను డాక్టర్ గిరీష తమ సిబ్బంది తో సందర్శించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున జ్వరాలు, డయేరియా వంటి వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో విద్యార్థులకు అందజేసే ఆర్వో ప్లాంటును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్