పాఠశాల అభివృద్ధికి ఎంఈఓలు కృషి చేయాలి

52చూసినవారు
పాఠశాల అభివృద్ధికి ఎంఈఓలు కృషి చేయాలి
పుంగనూరు నియోజవర్గంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఎంఈఓలు కృషి చేయాలని పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఎంఈఓలు గురువారం రొంపిచర్లలో చల్లా రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరిక, నాడు నేడు పనులపై ఎంఈఓలు వివరించారు. తెలుగు రైతు ఉపాధ్యక్షులు రామనాథం నాయుడు, ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్