పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సివిరెడ్డి, మాధవరెడ్డి, సుహేల్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభిమానులు భారీగా హాజరయ్యారు.