సారా కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

1577చూసినవారు
సారా కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని పేటూరుకు చెందిన ఎన్. రెడ్డెప్ప సారా విక్రయిస్తుండగా శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెంకట నరసింహులు ఆదివారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ సారా విక్రయాలపై సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్టు చెప్పారు. నిందితుడి నుంచి 18 లీటర్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్